may17Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

may17Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

may17Sunday2026 | టీ అంటే కేవలం పానీయం కాదు..!
ప్రతి సందర్భానికీ టీ ఓ స్పెషల్ కనెక్షన్
చైనాలో మొదలైన టీ కథ ప్రపంచానికి ఎలా చేరింది?
ఇండియన్ టీకి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత క్రేజ్?
ఒక్క కప్పు టీ వెనుక ఎన్నో భావోద్వేగాలు
ఇరానీ చాయ్ నుంచి కట్టింగ్ టీ వరకు.. టీ రుచుల ప్రపంచం
టీ పరిశ్రమతో కోట్లాది కుటుంబాలకు జీవనోపాధి

చాయ్… చటుక్కున తాగరా భాయ్..!
టీతో మన బంధం… కప్పులో కేవలం పానీయం కాదు, ఓ భావోద్వేగం!

“చాయ్… చటుక్కున తాగరా భాయ్…” అని మెగాస్టార్ చిరు ఎప్పుడో చెప్పిన డైలాగ్ ఇప్పటికీ టీ ప్రియుల నోట మారుమోగుతూనే ఉంటుంది. నిజంగానే టీ అంటే మనకో అలవాటు కాదు… అదో ఎమోషన్‌. ఉదయం కళ్లు తెరవగానే “ఓ టీ ఈవు…” అని మొదలయ్యే రోజు… రాత్రి వరకూ ఎన్నోసార్లు టీ కప్పుతోనే సాగుతుంది.

పనిభారంతో తల పేలిపోతోందా?… “స్ట్రాంగ్ టీ ఒకటి కొట్టు!”
జలుబుతో చికాకుగా ఉందా?… “అల్లం టీ తాగితే సెట్ అయిపోతుంది!”
చిటపట చినుకులు వడుతూ వాతావరణం చల్లగా ఉందా?… “యాలకుల టీ ఉంటే అదిరిపోతుంది!
ఫ్రెండ్స్ అంతా ఒక్కచోట చేరారా?… “ఒక ఇరానీ చాయ్ రౌండ్ వేయ్!”

ఇలా ప్రతి సందర్భానికీ టీ ఓ ప్రత్యేకమైన అనుబంధం.

టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మన టీం వరుసగా వికెట్లు కోల్పోతే బాధ తగ్గించేది టీనే! అదే బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొట్టినా… బౌలర్ హ్యాట్రిక్ తీసినా… “ఓ చాయ్ తో సెలబ్రేట్ చేద్దాం” అనిపిస్తుంది. అంతగా మన జీవితాల్లో కలిసి పోయింది ఈ చిన్న టీ కప్పు.

టీ అంటే కేవలం పానీయం కాదు…

స్టార్ హోటళ్లలో బస చేసే సెలబ్రిటీలు కూడా రోడ్డు పక్కన చిన్న బండి వద్ద గాజు గ్లాసులో దొరికే చాయ్ కోసం ఆగిపోతారంటే దటీజ్ టీ మజా. ఇంట్లో ఇష్టమైన వ్యక్తి చేత్తో ఇచ్చే టీకి ఒక రుచి ఉంటుంది. అదే రోడ్డు పక్కన బండి మీద పొగలు కక్కుతూ మరిగే టీకి మరో మజా.

అదే టీపొడి… అవే పాలు… అదే చక్కెర… అయినా ఒక్కో టీకి ఒక్కో టేస్ట్!
ఎందుకంటే టీ రుచి కేవలం పదార్థాల్లో కాదు.. దానిని ఇచ్చే మనసులో, తాగే సందర్భంలో ఉంటుంది.

చైనాలో మొదలై ప్రపంచాన్ని చుట్టేస్తున్న టీ కథ ఇదీ…

ఇప్పుడు ప్రతి ఇంట్లో కనిపించే టీ అసలు ఎక్కడ మొదలైందో తెలుసా? చరిత్రకారుల కథనం ప్రకారం టీ పుట్టింది చైనాలో. సుమారు 5 వేల ఏళ్ల క్రితం చైనా చక్రవర్తి షెన్‌నాంగ్ వేడి నీళ్లు తాగుతుండగా, చెట్టు ఆకులు ఆ నీళ్లలో పడటంతో ఒక ప్రత్యేకమైన వాసన, రుచి వచ్చిందట. అలా ప్రపంచం మొదటిసారి టీ రుచిని చూసిందని ఒక కథనం.

ఆ తర్వాత చైనా నుంచి జపాన్‌, కొరియా దేశాలకు టీ సంస్కృతి విస్తరించింది. 17వ శతాబ్దంలో యూరప్ దేశాలకు టీ చేరింది. బ్రిటిష్ వాళ్లు టీకి బాగా అలవాటు పడ్డారు. తర్వాత బ్రిటిష్ పాలనలో భారతదేశంలో టీ సాగును పెద్ద ఎత్తున ప్రారంభించారు.

ముఖ్యంగా అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాల్లో టీ తోటలు అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి “ఇండియన్ టీ” ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. నేడు భారతీయ చాయ్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది.

ఒక్క కప్పు టీ వెనుక ఎన్నో కథలు…

టీ కేవలం పానీయం కాదు.
అది ఉద్యోగుల బ్రేక్ టైమ్ ఫ్రెండ్.
ప్రేమికుల మధ్య స్వీట్ నథింగ్స్ కు తోడు.
రాత్రి చదువుకునే స్టూడెంట్‌కు ఎనర్జీ.
ఆఫీస్ మీటింగ్‌కు ఓపెనింగ్.
రాజకీయ చర్చలకు ప్రారంభ బిందువు!

అందుకే భారతదేశంలో ప్రధాని ప్రారంభించిన “చాయ్ పే చర్చా” అనే పదమే ఒక బ్రాండ్ అయిపోయింది.

కొంతమందికి ఉదయం టీ లేకపోతే తలనొప్పి మొదలవుతుంది. ఇంకొందరికి టీ తాగితేనే రోజు స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. “టీ తాగుదామా?” అనే మాటే చాలా సార్లు స్నేహాలను దగ్గర చేస్తుంది. శత్రువులను కూడా కలపొచ్చు.

టీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

  • ప్రపంచంలో అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి
  • అస్సాం, దార్జిలింగ్, నీలగిరి టీలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి
  • భారతదేశంలో లక్షలాది మంది టీ తోటల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు
  • టీ పరిశ్రమ ద్వారా కోట్లాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి
  • భారత్‌లో రోజుకు కోట్ల కప్పుల టీ తాగబడుతుందని అంచనా
  • “కట్టింగ్ చాయ్” సంస్కృతి ముంబయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది
  • ఇరానీ చాయ్ హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపు
  • అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, లెమన్ టీ వంటి అనేక రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు
  • టీ తాగడం వల్ల ఉల్లాసం, రిలాక్సేషన్ కలుగుతుందని చాలామంది భావిస్తారు
  • బ్రిటిష్ కాలంలో భారత టీ ప్రపంచ మార్కెట్‌లో పెద్ద స్థానం సంపాదించింది
  • టీ తోటల్లో పనిచేసే కార్మికుల జీవన పరిస్థితులపై ఇప్పటికీ అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి

జీవితంలో ఎంత టెన్షన్ ఉన్నా…
“ఓ టీ తాగుదాం రా…” అనే మాట వినిపించగానే మనసు కాస్త రిలాక్స్ అయిపోతుంది! ☕

-మాధవ్

+++++++++++++++++++++++++++++++++++++++++++++

++++++++++++++++++++++++++++++++++++

may17Sunday2026
may17Sunday2026

పొదుపుమంత్రం

ప్రకృతి సర్వజీవరాశికి సుఖంగా జీవించే మార్గాలను ముందే సిద్ధం చేసి ఉంచింది. వాటిని తు.చ తప్పకుండా పాటించే ప్రాణుల జీవనయానం సాఫీగానే సాగుతుంది. కొన్ని జీవులు భవిష్యత్తు అవసరాల కోసం ( ఆహారం దొరకని సమయాలలో) ఆహారాన్ని ముందే దాచుకోవడం, మిగిలిన దాన్ని పొదుపుగా వాడుకోవటం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

పొదుపుకు చీమలు పెట్టింది పేరు.ఇవి ఎండాకాలం అంతా కష్టపడి గింజలను, ఆహార పదార్థాలను సేకరించి తమ పుట్టల్లో భద్రపరుచుకుంటాయి. వర్షం పడినప్పుడు మొలకెత్తకుండా ఉండటానికి, చీమలు ఆ గింజలను రెండు ముక్కలుగా విరగ్గొట్టి దాచుకుంటాయి. ఇది వాటి ముందుచూపుకు నిదర్శనం.

ఉడుతలు ఆహారాన్ని దాచడంలో చాలా ‘తెలివైన’ ‘మతిమరుపు’ కలిగిన జీవులు. ఇవి వేల సంఖ్యలో విత్తనాలను, గింజలను భూమిలో పాతిపెడతాయి. శీతాకాలంలో ఆహారం దొరకనప్పుడు వీటిని తవ్వి తింటాయి. కొన్నిసార్లు ఉడుతలు తాము ఎక్కడ గింజలు దాచామో మర్చిపోతుంటాయి. అలా మర్చిపోయిన గింజలే భూమిలో మొలకెత్తి పెద్ద వృక్షాలుగా మారుతాయి. అంటే వీటి పొదుపు విధానం ప్రకృతికి పచ్చదనాన్ని ఇస్తోంది.

తేనెటీగలు తమ ఆహారాన్ని ద్రవ రూపంలో పొదుపు చేసుకుంటాయి. పూల నుంచి సేకరించిన మకరందాన్ని తేనెగా మార్చి తేనెతుట్టెల్లో నిల్వ చేస్తాయి. పూలు పూయని కాలంలో లేదా వాతావరణం అనుకూలించని సమయంలో ఈ తేనెనే ఆహారంగా తీసుకుని కాలం గడిపేస్తాయి.

వడ్రంగి పిట్టలు ఆహారాన్ని దాచుకోవడానికి ‘ధాన్యాగారాన్ని’ ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి చెట్టు కాండానికి వందలాది చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. ప్రతి రంధ్రంలో ఒక గింజను గట్టిగా బిగిస్తాయి. ఎండిపోయి చిన్నవిగా అయినప్పుడు, గింజలు రంధ్రం నుండి పడిపోకుండా ఉండటానికి వడ్రంగి పిట్టలు వాటిని నిరంతరం తనిఖీ చేస్తూ, సరిగ్గా సరిపోయే వేరే రంధ్రాల్లోకి మారుస్తూ ఉంటాయి.

ఒంటెలు ఆహారాన్ని బయట కాకుండా తమ శరీరంలోనే ‘పొదుపు’ చేసుకుంటాయి. ఒంటె తన వీపుపై ఉండే మూపురంలో కొవ్వును నిల్వ చేసుకుంటుంది. ఎడారిలో ఆహారం, నీరు దొరకనప్పుడు ఈ కొవ్వు కరిగి శక్తినిస్తుంది. ఒంటె ఒకేసారి వంద లీటర్ల నీటిని తాగి, తన శరీర కణజాలాల్లో నిల్వ ఉంచుకోగలదు .

ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, కష్టం రాకముందే వనరులను సమకూర్చుకోవడం, వాటిని దుబారా చేయకపోవడం దొరికిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు తినేయకుండా రేపటి కోసంపొదుపు చేసుకోవడం ఈ జీవుల నుండి మనం నేర్చుకోవాలి .

రేపటి సుఖం కోసం నేడు శ్రమించాలి. శ్రమించి సాధించిన వనరుల్లో కొంత దాచుకోవాలి. దాచుకోగా మిగిలిన వాటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రకృతిమాత అన్ని జీవరాసులకు నేర్పిన ఈ పాఠాన్ని బుద్ధిగా పాటించినప్పుడే కష్టసుఖాలలో కూడా జీవనం సాఫీగా సాగేది!

+_+_+_+_+_+_+_+_+_+_+_+_

మరో ముఖం

మనతో ఎంతో స్నేహంగా ఆప్యాయంగా ఉండే వాళ్ళు నిజంగానే మనపైన అంత స్నేహ భావం , ప్రేమ భావం కలిగి ఉంటారా లేక కాలంతో పరిస్థితులతో మారిపోతారా అన్న సందేహం నాలో ఎప్పటి నుండో ఉండేది.
ఆఫీసులో నాతో పాటు పని చేసే ఒక కొలీగ్ ఉండేవాడు.చాలా చిన్న స్థాయి అతనిది. కానీ అతను కళాకారుడు కావడంతో కొంచెం అభిమానంగా ఉండేవాడిని నేను. అతనితో చక్కగా కలిసిపోయే వాడిని. చాలా సార్లు నా దగ్గర ఆర్థిక సహాయం తీసుకున్నాడు. ప్రతీ విషయాన్ని నాతో డిస్కస్ చేసేవాడు. ఎన్నో బయట ఉద్యోగాలకు ఎప్లై చేస్తూ అతని సర్టిఫికెట్స్ పై నా సంతకాలు తీసుకునే వాడి. వేళ కాని వేళలో వచ్చి సహాయం అడిగినా చేసేవాడిని.
అయితే కొన్నాళ్ళ తర్వాత నాతో టచ్ లో ఉండటం మానేశాడు.నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు.అయితే నాకు షాక్ కొట్టిన విషయం ఏంటంటే ఒకరోజు బయట షాపింగ్ లో కలిశాడు అతను. నన్ను చూసి కూడా చూడనట్టు , నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు. బాగా ఆశ్చర్యపోయాను. ఏమయింది అతనికి అని కించిత్ బాధ పడ్డాను.
తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే అతనికి నార్త్ ఇండియాలో ఒక చోట జాబ్ వచ్చింది.ఇక నా అవసరం లేదు అని. అవసరం లేకపోయినంత మాత్రాన అలా ప్రవర్తిస్తారా కొంచెం కూడా నా పైన విలువ లేదా అని ఆలోచించాను. తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే తప్పు నాదే అని అర్థం అయింది. అతని మరో ముఖాన్ని ఊహించలేకపోవడం నా అమాయకత్వం అని తెలిసింది. సో ఫ్రెండ్స్..మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎదురైతే జాగ్రత్తగా ఉండండి !!

జీవన రంగస్థలంపై, నటుడివా? ప్రేక్షకుడివా?

All the world’s a stage. And all the men and women merely players; they have their exits and their entrances. అన్నాడు William Shakespeare తన హాస్య నాటకం As you like it(Act II, scene VII), ఇది ఫేమస్ Monologue, spoken by the character Jaques.

The world is a stage, but the play is badly cast అన్నాడు Oscar Wilde.

వెయ్యి పేజీల సంభాషణ ఒక వాక్యంలో ఉంటుంది ఒక్కోసారి. మన భగవత్ గీత, మన వేదాలు, మన పురాణ ఇతిహాసాలు, మన వాల్మీకి, మన వ్యాసుడు, బాసుడు, కాళిదాసు …అందరూ మహర్షులు. ఆదిశంకరులు, జయదేవుడు, ఒక divine connection వల్ల జీవితాన్ని అంత గొప్పగా వ్యాఖ్యానించారు, తమదైన ఆధ్యాత్మిక శైలిలో. నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం వల్ల సమాజం బాగుపడుతుంది.

గొప్ప కోసం, ఆడంబరాల కోసం, భయం కోసం, పుణ్యం కావాలి తప్పదు కాబట్టి అనుకుని సాధన చేస్తే ఫలితం చాలా తక్కువ.

ధర్మం, నీతి, సత్యం అంతర్గత ఔషధాలు. నీకు శాంతి లేదా, అయితే సత్యాన్ని ఆశ్రయించు, భయంగా ఉందా? ధర్మం ఆచరించు. బెంగగా ఉందా, నీతి మార్గంలో నడువు, గొప్ప గ్రంథాలు చదువు, మంచి స్నేహం చేయి, సత్సంగంలో ఉండు…, ఊహించని ఫలితాలు నీకు వస్తాయి. మహర్షుల మాటలు ఇవి. నీవు అయినా నేను అయినా ఆచరిస్తేనే ఫలితం. మాటలు కాదు ఆచరణే గీటురాయి.

నీవు పరిశీలకుడుగా ఉంటే విషయం ఒకలా అర్థం అవుతుంది. బాధితుడిగా ఉంటే ఇంకోలా అర్థం అవుతుంది. Perception & Context, చూసే కోణం బట్టి అర్థం, అవగాహన రెండూ మారిపోతాయి. తమిళనాడులో విజయ్ కి మ్యాజిక్ ఫిగర్ లేదు అని, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ పిలవకుండా కొంచం అవమానం చేస్తే, ఆ బాధ ఆ Frame లో ఉన్నవారికి, దేశంలో ఎందరో Emphasize అయ్యారు. అలాగే,

దెబ్బ నీకు తగిలితే ఆ నొప్పి నీకు తెలుస్తుంది. దక్షిణ భారతం, ఉత్తర భారతం, పై రాష్ట్రాల వారు దక్షిణాది వారిని తక్కువ చూపు చూస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు కొట్టుకుపోతున్నారు. దోపిడీ జరుగుతోంది, ఇక్కడ లోకల్ ప్రజలు ఎంతో నష్టపోతున్నారు, ఉద్యోగ వాతావరణంలో ఉత్తరాది వారు దక్షిణాది వారిని Humiliation చేస్తుంటారు, చేస్తున్నారని నిజాలు చెబితే…., బయట వారికి ఏం అర్థం అవుతుంది.

SIR, Special Intensive Revision, West Bengal లో ఏదో జరిగింది అని ఒక మీడియా చెబుతోంది. నిజాలు మీరు తెలుసుకోవాలి. అక్కడ మనం లేము. కాబట్టి ఆ తీవ్రత మనకు అర్థం కాదు. అలాగే మమత బెనర్జీ, రోహింగ్యాలను, పక్క దేశ మతస్తులను సపోర్ట్ చేస్తే అది మన దేశ సార్వభౌమాధికారానికి నష్టం. ఎవరినీ బుజ్జగించనవసరం లేదు. Religious arrogance మేం గొప్ప మా మతం గొప్ప, పక్క మతాలు, సైతానులు, కాఫిర్ లు అనే అహంకారం, మూర్ఘత్వం, మూఢ నమ్మకం…, మానవ జాతిని నాశనం చేస్తుంది.

Ground లో నువ్వు క్రికెట్ ఆడితే, నువ్వు ఆటగాడిగా ఉంటే అప్పుడు అక్కడ పరిస్థితి నీకు తెలుస్తుంది. గ్యాలరీలో ప్రేక్షకుడి మూడ్ వేరు.

బెంగాల్ వాళ్ళు, ఉత్తరాది వారు మనల్ని హీనంగా చూస్తున్నారు, రాజకీయం, వ్యాపారం, చదువు, ఉద్యోగాలు…., చాలా చోట్ల ఈ వివక్ష ఉంది అనే వాస్తవం మాట్లాడితే…, కొందరు శాంతంగా అబ్బే అదేం లేదు, అన్ని చోట్ల మనం పాజిటివ్, మంచి చూద్దాం అంటే…

బ్రిటీషు వాడు, చంపుతూ, మన యోధుల తలలు కోట గుమ్మాలకు వ్రేలాడ కడితే, జలియన్ వాలాభాగ్ హింస చేస్తే…, మన దేశ పౌరులు ఆహుతి అవుతుంటే…, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజులు పుట్టరా?

నువ్వు Actor వా? Spectator, Audience ఎక్కడ ఉన్నావు? దాన్ని బట్టి నీకు విషయంలో తీవ్రత అర్ధం అవుతుంది. గట్టు మీద కూర్చుని, జుట్టు దువ్వుకుంటూ చెప్పే కబుర్లకు విలువ ఉండదు.

జీవన రంగస్థలంపై నీ పాత్ర? ఎక్కడ ఉన్నావు? నీ దృష్టి కోణం, Sympathy or Empathy అనే రసాయనాలు నీ స్థానం, నీ పాత్ర, నీ ఔన్నత్యం, నీ సంస్కారం, నీ ప్రేమ, దయ, కరుణ…., అన్నిటి బట్టి అసలు హృదయం ఆవిష్కృత మవుతుంది.

సత్యమేవ జయతే.

+_+_+_+_+_+_+_+_+_+_++_+_+_+_+_+_+_+_+_+_++_+_+_+_+_+_+_+_+_+_+

తిరుమలేశుని సన్నిధిలో కటాహ తీర్థం

పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం వందలాది పవిత్ర క్షేత్రాల నిలయంగా భాసిల్లుతోంది. అటువంటి పుణ్య తీర్థ సమన్వితమైన తిరుమల క్షేత్రంలో స్వామి స్వయంభువుగా వెలసిన ఆలయ ప్రాంగణంలో అంతర్లీనంగా ప్రవహించే విరజా నది కి అనుబంధంగా ఉన్న పుణ్య తీర్థం బంగారు బావిగా దర్శనమిస్తుంటుంది. ఇది కాక తిరుమలేశుని విమాన ప్రదక్షిణ మార్గంలోని అన్నమయ్య భాండారం ఎదురుగా, శ్రీవారి హుండీ కి ఎడమ వైపున, వైకుంఠ ద్వార వెలుపలి దారికి చేరువగా ఈ కటాహ తీర్థం ఉంది దర్శన మాత్రంతో పాపాలను పరిహరించే వేం (పాపాలను) కట (తొలగించే) అద్రి (కొండ )అనే పేరుకు తగినట్టుగా ఈ తొట్టిలోని జలాలు పాపాలను తొలగిస్తుందని చాటి చెప్పే విధంగా కటాహ తీర్థం అని పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి.
తిరుమలేశుని ఆలయ ప్రాంగణంలో బావుల రూపంలో కనిపించే పావన తీర్థాలకు భిన్నంగా ఒక తొట్టి రూపంలో కనిపించే కటాహ తీర్థాన్ని తొట్టి తీర్థం అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయంలో నిర్వహించే అభిషేకాది కైంకర్యాల జలాలు ఈ తొట్టిలో చేరే విధమైన పారుదల వ్యవస్థ ఉంది. భక్తులు విమాన వేంకటేశుని దర్శించుకున్న తరువాత ఈ పవిత్ర తీర్థ జలాన్ని తలపై చల్లుకుని వెళ్లే వెసులుబాటు కూడా ఉండేది. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులతో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆ తీర్థ జలాల కోసం గుమికూడే భక్తులతో విమాన ప్రాకార మార్గం లో రద్దీ సమస్యలు మొదలయ్యాయి. ఇదే తరుణంలో ప్రతి శుక్రవారం స్వామి వారి మూలమూర్తి కి నిర్వహించే అభిషేక జలాన్ని గర్భాలయంలోనే సేకరించి సంబంధిత ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు, ఇతర ప్రముఖులకు చిన్న బాటిళ్ల లో అందచేసే సంప్రదాయం మొదలైంది.
ఈ మార్పుచేర్పుల నేపథ్యంలో గర్భాలయ ప్రాంగణాన్ని, ఆలయంలో వినియోగించే పలు పూజా పాత్రలను శుద్ధి చేసిన జలాలను మాత్రమే ఆ తొట్టి కి వెళ్లే పారుదల వ్యవస్థ లో మళ్లించే సంప్రదాయం అమలులోకి వచ్చింది. ఆ విధంగా వచ్చే శుద్ధి చేసిన నీటి తో నిండిపోయే తొట్టిని మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటకు తరలించే వ్యవస్థ మాత్రమే ప్రస్తుతం అమలులో ఉంది. . దాంతో ప్రస్తుతం ఆ తొట్టి తీర్థం అందరికీ కనిపించని విధమైన మూత అమరిక తో మాత్రమే మిగిలివుంది.

ఓం నమో వెంకటేశాయ

click here to read more

Leave a Reply