2women | మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్ద ఘటన

2women | మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్ద ఘటన
2women | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ వద్ద ఇద్దరు మహిళలను హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది. మృతులు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మహిళలుగా గుర్తించారు.
కొద్ది రోజులుగా తాండూరులో అదృశ్యమైన ఇద్దరు వృద్ధ మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో హత్య చేసి నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యలకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
