జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ…

జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ…
ప్రజలలో పరిశుభ్రతపై చైతన్యం తీసుకురావాలి..
పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి..
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ లోని ప్రతి 3 శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి గౌరవ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్నిచేపట్టారు.శనివారం పరిశుభమైన, ఆరోగ్యకరమైన వాతావరనన్నీ ఏర్పాటు చెయ్యడమే లక్షంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని డి సి ఆర్ బి స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ కార్యాలయం, సైబర్ క్రైమ్ , ఫ్యాక్షన్ జోన్ కార్యాలయాలు, సాయుధ బలగాల కార్యాలయాలు, మోటార్ వెహికల్ కార్యాలయం, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాలు, చుట్టు పక్కల ప్రాంగణాలను సమగ్రంగా పరిశుభ్రం చేశారు.
పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధులు నిర్వహించే చోట వాతావరణాన్ని పరి శుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా పనిచేసే చోటా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని,ప్రజలలో పరిశుభ్రతపై చైతన్యం తీసుకొని రావడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
