2.22Article | మ్యాచ్ డిలే.. రూ.12ల‌క్ష‌ల ఫైన్‌

2.22Article | మ్యాచ్ డిలే.. రూ.12ల‌క్ష‌ల ఫైన్‌

2.22Article | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ల‌క్నో జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన కీలక మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిషబ్ పంత్ కు రూ.12 లక్షల జరిమానా విధించింది. చెన్నైపై లక్నోసూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని సాధించిన ఆనందంలో ఉండ‌గా పంత్‌కు జ‌రిమానా విధించ‌డంతో షాక్ గుర‌య్యాడు.

ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు రిషబ్ పంత్‌ను దోషిగా తేల్చారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ సీజన్లో ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌కు మాత్రమే రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఒకవేళ ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే జరిమానా మొత్తం పెరగడంతో పాటు జట్టులోని మిగిలిన సభ్యులకు కూడా మ్యాచ్ ఫీజులో కోత పడే అవకాశం ఉంటుంది.

Leave a Reply