అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి

దమ్మపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ లారీని దమ్మపేట మండల పరిధిలోని ముష్టిబండ గ్రామ శివారులో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని దాచారం ఇసుక ర్యాంప్ నుంచి కుక్కునూరు, అశ్వారావుపేట, దమ్మపేట మీదుగా ముష్టిబండకు ఇసుక తరలిస్తుండగా టిప్పర్ లారీని తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు.

డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ఇసుక లోడ్ చేయించిన వ్యక్తులు, లారీ యజమాని, దిగుమతి చేసుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply