లక్షెట్టిపేట రైస్‌మిల్లు ఆకస్మికంగా తనిఖీ

లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ : రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు, లారీల ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చూడాలని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీరామ రైస్‌మిల్లును డీసీపీ ఎ. భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో లక్షెట్టిపేట ఎమ్మార్వో దిలీప్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు విధానం, లారీల ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియను అధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించారు.
ధాన్యం లోడింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్‌మిల్ యాజమాన్యానికి ఆదేశించారు. రైతులకు, లారీ లోడింగ్ విషయంలో ఎలాంటి జాప్యాలు లేకుండా సకాలంలో సేవలు అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.
