Prices | నిత్యావసరాల ధరలతో సామాన్యుడికి చుక్కలు

Prices | నిత్యావసరాల ధరలతో సామాన్యుడికి చుక్కలు

Prices |వంటింట్లో పెరుగుతున్న ఖర్చుల భారము
పాల ధరల పెంపుతో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి
గ్యాస్ సిలిండర్ ధరలపై ఆందోళన
వ్యక్తిగత పరిశుభ్రత వస్తువుల ధరల పెరుగుదల
ద్రవ్యోల్బణ ప్రభావం మరియు ప్రజల ఆవేదన

Prices | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని గమనిస్తే “కాదేదీ ధరల పెరుగుదలకు అనర్హం” అన్నట్లుగా ఉంది. గ్యాస్ సిలిండర్ నుండి నిత్యం వాడే పాల వరకు ప్రతి వస్తువు ధర పెరిగి సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. మధ్యతరగతి, పేద ప్రజలు తమ నెలవారీ బడ్జెట్‌ను సరిదిద్దుకోలేక సతమతమవుతున్నారు. ఒకప్పుడు పండగ వస్తేనే ధరలు పెరుగుతాయని భయపడే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు రోజుకో కొత్త ధర వినియోగదారులకు షాక్ ఇస్తోంది.

వంటింట్లో ఆయిల్ మంటలు..

Prices

వంట గదిలో అత్యంత కీలకమైన వంట నూనె ధరలు ఇప్పుడు అదుపు తప్పాయి. గతంలో లీటర్ ధర సుమారు రూ. 150 ఉండేది, అది ఇప్పుడు ఏకంగా రూ.170 నుండి రూ. 200 వరకు చేరుకుంది. అయితే మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లో కేవలం నూనె కోసమే అదనంగా రూ. 500 నుండి రూ. 800 వరకు కేటాయించాల్సి వస్తోంది. నూనె ధరల పెరుగుదల ప్రభావం బయట దొరికే టిఫిన్స్, భోజనాల ధరల మీద కూడా పడే అవకాశం ఉంది.

పాల ధరల భారం..

చిన్నారుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరమైన పాల ధరలను పెంచుతూ ప్రముఖ డైరీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.అమూల్, మదర్ డెయిరీ సంస్థలు లీటర్ పాలపై రూ. 2 చొప్పున ధర పెంచాయి.
ఇది చిన్న మొత్తంగా అనిపించినా, నెలాఖరుకు వచ్చేసరికి సామాన్య కుటుంబాలపై గణనీయమైన భారాన్ని మోపుతోంది.

ముంచుకొస్తున్న ‘గ్యాస్’ ముప్పు..

ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న జనాలకు గ్యాస్ సిలిండర్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. త్వరలోనే సిలిండర్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే వంట గ్యాస్ ధర పెరిగితే అది పరోక్షంగా అన్ని సేవలపై ప్రభావం చూపుతుంది.

వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులూ ప్రియమే!

కేవలం ఆహార పదార్థాలే కాదు, నిత్యం వాడే సబ్బులు, షాంపూల ధరలు కూడా దాదాపుగా పెరగనున్నాయి. ఎఫ్.ఎం.సి.జి కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

ఒకవైపు తక్కువ జీతాలు, మరోవైపు ఆకాశాన్నంటుతున్న ధరలు. దేనికోసం ఖర్చు చేయాలో, దేనిని ఆపాలో అర్థం కానీ పరిస్థితి. రోజురోజుకూ పెరుగుతున్న ఈ ధరలు సామాన్యుడి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యావసరాల ధరలను అదుపు చేయాలని సామన్య మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ప్రజల పొదుపు తగ్గిపోతోంది. నిత్యావసరాలకే ఆదాయం సరిపోతుండటంతో ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం మార్కెట్ పర్యవేక్షణ పెంచి, ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

CLICK HERE TO READ Algae tree | కాలుష్యానికి చెక్‌ పెట్టే ఆల్గే ట్రీ

CLICK HERE TO READ MORE

Leave a Reply