గొర్రె పిల్ల కోసం వెళ్లి.. బావిలో పడి బాలుడి మృతి!

గొర్రె పిల్ల కోసం వెళ్లి.. బావిలో పడి బాలుడి మృతి!

ఖానాపురం, ఆంధ్రప్రభ: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులిగిల్ల రాఘవ (11) అనే బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు.

వేసవి సెలవులు కావడంతో రాఘవ ఇంటి సమీపంలోని వ్యవసాయ పొలాలకు గొర్రె పిల్లలను మేపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ గొర్రె పిల్ల బావి అంచు వద్ద మేస్తుండటాన్ని గమనించిన బాలుడు, అది బావిలో పడిపోతుందేమోనని భయంతో అక్కడికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రామ్మోహన్ పర్యవేక్షణలో ఫైర్ సిబ్బంది, ఈతగాళ్ల సహాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Leave a Reply