వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు
పాయకాపురం, ఆంధ్రప్రభ: సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై మామిడి పళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
డాబాకోట్లు నుంచి బుడమేరు వైపు వెళ్తున్న బొలెరో వాహనం వెనుక చక్రం బేరింగ్ విడిపోవడంతో చక్రం ఊడిపోయే పరిస్థితి ఏర్పడి ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయింది. దీంతో వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు జేసీబీ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.
అదే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలను క్రమబద్ధీకరిస్తూ, రైల్వే అండర్‌పాస్ మార్గం ద్వారా మళ్లించారు. ట్రాఫిక్ పూర్తిగా సాఫీగా సాగేవరకు పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని నియంత్రించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై ఎప్పుడైనా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు రైల్వే అండర్‌పాస్ మార్గాన్ని వినియోగించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
