యువతి యువకులు డ్రగ్స్ కు దూరం ఉండండి

యువతి యువకులు డ్రగ్స్ కు దూరం ఉండండి
-జిల్లా ఎక్సైజ్ ఎస్పీ కిరణ్ నాయక్
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: డ్రగ్స్ రహిత సమాజం కోసం పోస్టర్ కరపత్రంను బుధవారం నాడు జిల్లా ఎక్సైజ్ ఎస్పీ బి. కిరణ్ నాయక్ ను కలిసిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా కిరణ్ నాయక్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ యువతీ యువకులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ కుటుంబాలను రక్షించాలని అన్నారు. డ్రగ్స్ అమ్మాయి తీసుకున్న అబ్బాయిలకు ఇబ్బంది. అబ్బాయి తీసుకుంటే అమ్మాయికి ఇబ్బంది కావున ఎవరు తీసుకోకుండా మంచి సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలని అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐతో పాటు టీం సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు బద్దె వీరభద్రం. జిల్లా ఎడ్యుకేషనల్ సెల్ శ్రీకాంత్ గౌడ్. భానుథ్ సంతోష్. రాజు. తదితరులు పాల్గొన్నారు.
