green signal | రూ.530 కోట్లు కేటాయింపు
green signal | రూ.530 కోట్లు కేటాయింపు
green signal | జూన్ నెలలో శంకుస్థాపన
బాచుపల్లి ఫ్లై ఓవర్ రెడీ
ఈ నెలలోనే రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
green signal | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిత్యం రద్దీతో సతమతమవుతున్న హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వం ఓ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ఐటీ కారిడార్, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణం చేసే వారి సౌకర్యార్థం ఫ్లై ఓవర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. అల్విన్ కాలనీ నుంచి మియాపూర్ వరకు ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ఫ్లైఓవర్ ని నిర్మిచనుంది. అందుకుగాను ప్రభుత్వం రూ.530 కోట్ల రూపాయలతో భారీ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌కు చెక్..
నగరంలో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మియాపూర్ మార్గం ముందువరుసలో ఉంటాయి. అయితే రోజు ఆఫీస్ టైమ్‌లలో సిగ్నల్లు దాటాలంటే నిమిషాల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులు ఈ రూట్లో ప్రయాణించాలంటే చుక్కలు చూస్తున్నారు. దీనికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుతో సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం 1.8 కిలోమీటర్ల పొడవుతో ఈ భారీ ఫ్లైఓవర్‌ను రూపకల్పన చేసింది. దీని అంచనా వ్యయాన్ని 530 కోట్లకు టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి పూర్తి డిజైన్ మొత్తం రెండువైపులా కలిసి 6 లైన్ల రోడ్లు 24 మీటర్ల పోడవుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు 200 కోట్లు పెట్టారు. దీంతో జేఏన్టీయు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ తగ్గనుంది. ప్రయాణ సమయం ఇధన ఖర్చులు లక్షలాది మందికి ఉపశమనం కలగనుంది.
జూన్ నుంచే పనులు ప్రారంభం?
ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి అన్ని అనుమతులు సకాలంలో వస్తే ప్రభుత్వం దీనిని వచ్చే నెల జూన్ నాటికి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు మరిత మేలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బాచుపల్లి ఫ్లై ఓవర్ రెడీ
కాగా, హెచ్ ఎండీఏ ధ్వర్యంలో నిర్మించిన బాచుపల్లి జంక్షన్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. వేగంగా విస్తరిస్తున్న బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు ఇది ప్రధాన పరిష్కారంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా బాచుపల్లి జంక్షన్ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మియాపూర్, గాజులరామారం, నిజాంపేట్, బౌరంపేట్ వైపు వెళ్లే వాహనాలతో జంక్షన్ తీవ్ర రద్దీగా మారేది. కొన్నిసార్లు వాహనాలు దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
రూ.141 కోట్లతో..
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు మూడు సంవత్సరాల క్రితం హెచ్‌ఎండీఏ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు 1.3 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.141 కోట్లను మంజూరు చేయగా.. అందులో సుమారు రూ.71 కోట్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి వినియోగించారు. మిగతా నిధులను భూసేకరణ, ఇతర అనుబంధ పనుల కోసం ఖర్చు చేశారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మియాపూర్-గండిమైసమ్మ మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడి చాలా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే నిజాంపేట్, మల్లంపేట్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు కూడా మరింత సులభం కానున్నాయి. కొత్తగా రూపుదిద్దుకున్న జంక్షన్‌తో బాచుపల్లి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
