Telangana | పాల్వంచలో హృదయ విదారక ఘటన

Telangana | పాల్వంచలో హృదయ విదారక ఘటన

Telangana | పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), ఆంధ్రపభ : మానవత్వం మంటగలిసింది. కన్నప్రేమ కఠినంగా మారింది. లోకం చూడకముందే ఒక పసి ప్రాణం అనాథగా విసిరేసింది. పాల్వంచ పట్టణంలోని బొల్లోరిగూడెంలో బుధవారం వెలుగుచూసిన ఘటన స్థానికుల గుండెలను పిండేస్తోంది.

ఏ పాపం ఎరుగని ఆ పసికందును ఎవరు అక్కడ వదిలేశారో కానీ, ఆ చిన్నారి అవశేషాలు కుక్కలకు ఆహారంగా మారాయి. కుక్కలు పసికందు తల భాగాన్ని పీక్కుతింటున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే వాటిని తరిమికొట్టినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఆ హృదయ విదారక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి.

Telangana

పసికందు అవశేషాల నుంచి వస్తున్న దుర్వాసనతో బొల్లోరిగూడెం వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ దారుణం ఎప్పుడు జరిగింది? ఎవరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఊరందరినీ వేధిస్తున్నాయి. ఆడపిల్ల అని వదిలించుకున్నారా? లేక అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో ఈ దారుణానికి పాల్పడ్డారా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒక ప్రాణం ఇలా అవశేషాలుగా మారి కుక్కల పాలవ్వడం చూసి స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, విచారణ చేపట్టి ఈ అమానుషానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బొల్లోరిగూడెం వాసులు డిమాండ్ చేస్తున్నారు.

CLICK HERE TO READ Government Hospital | పెళ్లి సందడి.. క్షణాల్లో విషాదం…

CLICK HERE TO READ MORE

Leave a Reply