రాజయ్య సంస్మరణ సభ

రాజయ్య సంస్మరణ సభ

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సీఐటీయూ నాయకుడు కంపేటి రాజయ్య సంస్మరణ సభను ఈ నెల 24 న భూపాలపల్లి పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంద నరసింహారావు, తుమ్మల రాజారెడ్డి తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు అధ్యక్షతన శ్రామిక భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన నేతలు కంపేటి రాజయ్య కార్మికుల సమస్యలు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, గుడిసె వాసుల ఇళ్ల పట్టాలు, భూములు కోల్పోయిన రైతుల సమస్యల పై నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేస్తూ కార్మిక వర్గానికి విశేష సేవలందించారని కొనియాడారు. సింగరేణి పరిరక్షణ, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, క్వార్టర్స్, మహిళా కార్మికులకు క్రెచ్ సౌకర్యం కోసం ఆయన అనేక ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు రాజయ్య అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు గుర్రం దేవేందర్, సీహెచ్ రవికుమార్, మేకల మహేందర్, కొండ లక్ష్మి, విజయలక్ష్మి, తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply