29న వాహనాలకు వేలం
29న వాహనాలకు వేలం
- జిల్లా రవాణా శాఖ అధికారి జి. సంజీవ్ కుమార్
నరసరావుపేట, ఆంధ్రప్రభ : రికార్డులు లేకుండా, పన్నులు చెల్లించకుండా తిరుగుతూ పట్టుబడిన వాహనాలను, రవాణా శాఖ అధికారుల దాడులలో పట్టుబడిన వాహనాలను, నిర్బందంలో ఉన్న వాహనాలను ఈ నెల 29న వేలం నిర్వహించడం జరుగుతుందని జిల్లా రవాణా శాఖ అధికారి జి. సంజీవ్ కుమార్ తెలిపారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల ఆర్టీసీ డిపోలలో, పెదకూరపాడు పోలీసు స్టేషన్ లలో మొత్తం 14 వాహాలు వాహనాలు ఉన్నయని, అందులో 2 ఆటోరిక్షాలు, 8 తేలికపాటి వస్తువుల వాహనాలను, 4 మ్యాక్సీక్యాబ్ లను ఈ వేలం ద్వారా విక్రయించడతాయని, సంభందిత వాహన యజమానులు, ఫైనాన్షియర్లు తమ వాహనాలకు చెల్లించవలిసిన పన్నులు, అపరాధ రుసుం చెల్లించి ఈ నెల 15 లోపల విడుదల చేయించుకోవాలని, అలా విడుదల చేసుకోని వాహనాలను ఈ నెల 29 న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు.
