కాంగ్రెస్ నేత తోట్ల ధర్మయ్యకు ఎమ్మెల్యే పరామర్శ

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట్ల ధర్మయ్య కుమారుడు తోట్ల క్రాంతి కుమార్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం కడెం మండలంలోని పెద్దూరు గ్రామంలో వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ధర్మయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. అలాగే వేసవి కాలంలో ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల నాయకులు ఆకుల లచ్చన్న, బొడ్డు గంగన్న తదితరులు పాల్గొన్నారు.
