బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి

  • కమ్మర్‌పల్లి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని కమ్మర్‌పల్లి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినప్పటికీ, కేంద్ర మంత్రికి చెందిన కుమారుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడం సరికాదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, సీనియర్ నాయకులు సుభాష్ గౌడ్, రెంజర్ల మహేందర్, కొత్తపల్లి రఘు, మల్కాయి రాజన్న, సుంకరి మురళి, బద్దం రాజేష్ రెడ్డి, నవాబ్ పాషా, కోరే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.