దరఖాస్తుల ఆహ్వానం…
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఐటీఐ,ఏటీసీ భూపాలపల్లిలో 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ తెలిపారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సులను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
ఫిట్టర్ ట్రేడ్‌లో రెండేళ్ల కోర్సుకు 20 సీట్లు అందుబాటులో ఉండగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పరిధిలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్–ఎఫ్ఈఎమ్, సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మొత్తం 192 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 8గా నిర్ణయించినట్లు వెల్లడించారు. మే 14 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పదో తరగతి మార్కుల మెమో వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 8500465034 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ కోరారు.
