భగీరత్ ను అరెస్టు చేయాలని మహిళల నిరసన

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్ ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ మహిళ విభాగం ఆధ్వర్యంలో నిరసన దిగారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్ల కార్డులు చేతబూని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి సంజయ్ కుమారుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడటం సిగ్గుచేటు అన్నారు. వెంటనే భగీరత్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.