తిలక్ వర్మ పోరాటం.. ఆర్‌సీబీ ముందు 167 పరుగుల లక్ష్యం!

తిలక్ వర్మ పోరాటం.. ఆర్‌సీబీ ముందు 167 పరుగుల లక్ష్యం!

ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది.

ముంబై బ్యాటర్లలో యువ ఆటగాడు తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ 42 బంతుల్లో 57 పరుగులు చేసి అర్ధ సెంచరీతో రాణించాడు. అతనికి తోడుగా నమన్ ధీర్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ 22 పరుగులు చేసి అవుటయ్యాడు.