మోదీ సభలో బండి సంజయ్ సంచలన స్పీచ్

మోదీ సభలో బండి సంజయ్ సంచలన స్పీచ్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “శ్రీరామ్‌ నినాదంతోనే ఆ పార్టీని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశాం” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నడవదని, అలాగే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలపై మాట్లాడారు.

బెంగాల్‌లో బీజేపీ ఈజీగా గెలవలేదని.. 300 మందికి పైగా కార్యకర్తలు బలిదానం చేశారని అన్నారు. కేరళలో కూడా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. సభలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి.