Materialological | విద్యా సంస్థల పని వేళల్లో మార్పు..

Materialological | విద్యా సంస్థల పని వేళల్లో మార్పు..
- ఉదయం 9:40 నుండి సాయంత్రం 4.30 వరకు బడులు
Materialological | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పని వేళలను మారుస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ మెటీరియాలజికల్ (Materialological) డిపార్ట్‌మెంట్ నివేదిక మేరకు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపధ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాల సమయాలను సవరించి, ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ(Upper Primary), హై స్కూళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
అన్ని మండల విద్యా అధికారులకు, ప్రభుత్వ, ఎల్బీ, కేఏజీబీవీ, మోడల్ హై స్కూళ్లు, అలాగే ప్రైవేటు విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్గదర్శకాలను పాటించకపోతే సంబంధిత మేనేజ్మెంట్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ఆసిఫాబాద్ జిల్లాలోనూ…!
- ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాల్లో చలి తీవ్రత నేపథ్యంలో పాఠశాల పనివేళలను ఉదయం 9.40 నుండి సాయంత్రం 4:30 వరకు పనిచేసేలా ఉత్తర్వులు ఇదివరకే జారీ అయ్యాయి.
