బెట్టింగ్ యాప్‌లపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌లను అరికట్టడానికి త్వరలో ఒక విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయని మంత్రి లోకేష్ అన్నారు.
దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా నిరోధించడంతో పాటు, సంబంధిత యాప్‌లపై అవగాహన కల్పించి చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారమని ఆయన అన్నారు.
దీనికోసం యాంటీ-బెట్టింగ్ విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి అన్నారు. తాము తీసుకురాబోయే విధానం దేశానికే ఒక నమూనాగా ఉంటుందని ఆయన అన్నారు. దీని కోసం అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.