ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తుల గడువు పొడిగింపు
బాసర( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలోని బాసర, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఆర్జీయూకేటీ (RGUKT) యూనివర్సిటీలలో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుల గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ వీసీ గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పొడిగించిన గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.
