bjp | ఆస్తి రూ.85ల‌క్ష‌లే..!

bjp | ఆస్తి రూ.85ల‌క్ష‌లే..!

bjp |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించి, చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. మమతా బెనర్జీపై వరుసగా (2021, 2026) విజయం సాధించి, భాజపా (BJP) ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇవాళ ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయాన్ని (207 సీట్లు) సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇవాళ భాజపా లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికై, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర తొలి భాజపా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈయ‌న 1970లో జ‌న్మించారు. సువేంద తండ్రి సిసిర్ కేంద్ర‌మంత్రిగా ప‌ని చేశారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న సువేందు 1998లో టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా, 2009, 14లో ఎంపీగా విజ‌యం సాధించారు. 2016-20 వ‌ర‌కు మ‌మ‌త కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. 2020లో బీజేపీలో చేరారు. త‌న ఆస్తి రూ.85ల‌క్ష‌ల‌ని, కారు కూడా లేద‌ని అఫిడ‌విట్‌లో వెల్ల‌డించారు.