వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

కరీంనగర్ టౌన్, ఆంధ్రప్రభ ; కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం బిగినింగ్ బ్రేక్ లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి వేడుకున్నట్లు గంగుల కమలాకర్ తెలియజేశారు.