వర్షానికి కొట్టుకుపోయిన వరి ధాన్యం..

వర్షానికి కొట్టుకుపోయిన వరి ధాన్యం..

చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : అకాల వర్షం అన్నదాతల కొంప ముంచింది.ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతుల నోట్లో వర్షం మన్ను కొట్టింది.ఇప్పటికే మక్కల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు వరి కోతలు జోరుగా కొనసాగుతుండడం అట్టి వరి ధాన్యాన్ని రైతులు సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించడం జరుగుతుంది.మండలంలో గురువారం రాత్రి8 గంటల నుండి గంటన్నర పాటు ఏకదాటిగా ఉరుములు,మెరుపులు,గాలులతో కూడిన వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్న రైతులు ఆగమాగమయ్యారు.మండలంలోని చేరువుకొమ్ము తండాకు చెందిన బోడ రవి అను రైతు తనకున్న మూడున్నర ఎకరాల వరిని కోసి ధాన్యాన్ని నాలుగు రోజుల క్రితం ఎల్లాయిగూడెంలో ఎప్పటికి ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రం స్థలంలో పోసాడు.సుమారు మూడున్నర ట్రాక్టర్ల లోడ్ల వడ్లకు గాను గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఒక ట్రాక్టర్ లోడ్ (సుమారు ముప్పై ఐదు క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోయినట్లు బాధిత రైతు రోదిస్తూ వెల్లడించాడు.అధిక పెట్టుబడులతో పంట సాగు చేస్తే దిగుబడి తక్కువ వచ్చిందని,అందులోను సుమారు నలభై బస్తాల వడ్లు కొట్టుకుపోవడంతో ఆర్థిక నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నారు.