ఉత్తమ విధానాల అమలుకు కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు

ఉత్తమ విధానాల అమలుకు కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు
అమరావతి, ఆంధ్రప్రభ : పరిపాలనలో నూతన ఒరవడికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకా రం చుట్టా రు. జిల్లా కలెక్టర్లు అమలు చేసిన ఉత్తమ విధానా లను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకు న్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ వా రిని మెంటర్లుగా సీఎం చంద్ర బాబు ప్రకటించారు. గురు వారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలి రోజు కీలక నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. వివిధ జిల్లాలలో 9 బెస్ట్ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే బాధ్య తను 10 మంది కలెక్టర్లకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా స్మార్ట్ కిచెన్స్ బాధ్యత కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు, సంజీవని ప్రాజెక్టు – చిత్తూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు సుమిత్, కృతికా శుక్లా కు అప్పగించారు. అత్యంత కీలకమైన జలధార ప్రాజెక్టు బాధ్యత అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ కు, రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా ఫోర్ విజిట్స్ ఏ విలేజ్ కాన్సెప్ట్ – నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా కు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక హాస్టల్ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముస్తాబు బాధ్యత పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు.
నెట్ జీరో కాన్సెప్ట్ – అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, దివ్యాంగులకు ఆసరాగా ఉండే స్వాభిమాన్ – శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు,ఆక్వా, వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియోగం– సర్కులర్ ఎకానమీ – పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కి అప్పగించారు.అన్ లాకింగ్ వెల్త్ కాన్సెప్ట్ – తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు అప్పగిస్తూ ఆదే శాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,బెస్ట్ ప్రాక్టీసెస్ అమలును ప్రవేశపెట్టడం ద్వారా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారని అభినందించారు. మూస పద్దతి ఆలోచనల నుంచికలె క్టర్లు బయటకు వస్తున్నారన్నారు.
వినూత్న ఆలోచనల ద్వారా తక్కువ ఖర్చుతో మెరు గైన ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లు అమలు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రజల్లో అవగాహన కూడా కలుగుతోంద న్నారు.
ప్రజలకు మేలు జరిగేలా, లబ్ది చేకూరేలా ఉత్తమ పద్ధతులను అమలు చేస్తే ప్రజల నుంచి ఆదరణ కూడా లభిస్తుందన్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా జిల్లాల్లో అత్యు త్తమ విధానాలు రాష్ట్రంలో అమలు అయ్యేందుకు అవకాశం ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. ల్యాండ్ పూలింగ్ లాంటి వినూత్న ప్రక్రియ ద్వారా తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో ప్రజలకు, ప్రభుత్వానికి ఆస్తి చేకూరిందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో లిటిగేషన్లు అన్ లాక్ కావాలి. అప్పుడే వివాదాలు పరిష్కారమై సంతోషంగా ఉంటా రన్నారు. ఇక సింగపూర్ లో అనుసరించిన అత్యుత్తమ విధానాలను అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్ర బాబు వెల్లడించారు.
