49th Match l సొంత గడ్డపై మరోసారి!
49th Match l సొంత గడ్డపై మరోసారి!
49th Match l ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 49వ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో హైదరాబాద్ జట్టు హోమ్ గ్రౌండ్‌లో మొదట బ్యాటింగ్ చేయనుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్ 12 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ టీమ్ టేబుల్ టాపర్‌గా నిలిచే అవకాశం ఉంది. పంజాబ్ జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొని ఒత్తిడిలో ఉండగా, హైదరాబాద్ జట్టు తన సొంత గడ్డపై మళ్లీ ఫామ్‌లోకి రావాలని భావిస్తోంది.
తుది జట్లు…
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ , హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ , ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ , మార్కస్ స్టోయినిస్, సూర్యాన్ష్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
