అడిషనల్ కలెక్టర్ సంగీతకు ఘన స్వాగతం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో నూతనంగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన సంగీతను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రెసా కార్యవర్గం సభ్యులు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్స్, సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు కె.గంగాధర్ రావు, కార్యదర్శి మన్నె కిరణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు దశరథ్, బాలరాజ్, కార్తీక్, విష్ణు, వీరేశం, నజీర్, పాషా, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.