ప్రభుత్వ విప్ ఐలయ్య పై ఆరోపణలు అర్ధరహితం..
ఆలేరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమైనవని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్ అన్నారు. స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్ రావును విమర్శించే స్థాయి ఐలయ్యకు లేదని బిఆర్ఎస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందని చెప్పారు. హరీష్ రావును విమర్శిస్తే ఐలయ్య దిష్టిబొమ్మను ఆలేరులో ఆ పార్టీ నాయకులు దగ్ధం చేయడం అనాలోచితమని అన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మరొకసారి ఐలయ్యను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించి బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన చెప్పారు. నాయకులు బీజన భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి అంజనేయులు, కౌన్సిలర్లు పస్తం అంజనేయులు, జూకంటి సంపత్, కో ఆప్షన్ సభ్యులు ఎం ఎస్ విజయ్ కుమార్, చింతకింది మురళి, మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్, నాయకులు జెట్ట సిద్ధులు, కలకుంట్ల లోకేష్, మల్లెల శ్రీకాంత్, సుక్క రామస్వామి , కాసుల భాస్కర్, మహమ్మద్ గౌస్, జావిద్ పాల్గొన్నారు.
