30days | 6 కోట్ల బీర్లు తాగేశారు!

30days | 6 కోట్ల బీర్లు తాగేశారు!

30days | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణలో భానుడు భగభగలాడిస్తున్నాడు.. నిప్పులు కురిపిస్తున్నాడు. మరి ఈ సెగ నుంచి ఉపశమనం పొందడానికి జనం ఏం చేస్తున్నారో తెలుసా.. ఏసీలు, కూలర్లు పక్కన పెడితే.. మందుబాబులు ‘చిల్’ అవ్వడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు రాష్ట్రంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జస్ట్ 30 రోజులు.. ఏకంగా 6 కోట్ల బీర్లు తాగేశారుఢ అవునండీ బాబూ.. మీరు విన్నది నిజమే. ఎండల దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా బీర్ల ప్రవాహం పారుతోంది. కేవలం 30 రోజుల్లోనే రికార్డు స్ధాయిలో బీర్లు అమ్ముడవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

రికార్డు అమ్మకాలు..
ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో దాదాపుగా 50.50లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే సుమారుగా 6 కోట్ల బీర్లు అన్నమాట. గతే ఏడాదితో పోలిస్తే.. ఈ సారి భారీగా పెరిగింది. గత ఏడాది 41.39 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. రాష్ట్రంలో నమోదవుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతలు, కొనసాగుతున్న ఐపీఎల్ (IPL) సందడి, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బీర్లకు డిమాండ్ అమాంతం పెరిగింది.

30days

మే నెల ముగిసే సమయానికి ఈ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలాఖరుకల్లా అమ్మకాలు 75 లక్షల కేసులకు చేరుకోవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ వేసవిలో తెలంగాణలో బీర్ల ప్రవాహం కొనసాగుతోంది.