డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
- చీదర మహేష్
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పట్టణానికి చెందిన చీదర మహేష్ ను ఎంపిక చేసినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చీదర మహేష్ గత 28 సంవత్సరాలుగా ఫర్టిలైజర్ వ్యాపారంలో ఉండి ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉత్తమ సేవలు అందించాలని ఆయన సేవలను గుర్తించి స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన మహబూబాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రతాపని పాండురంగయ్యకు, జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
