Mamata Banerjee | 100 సీట్లలో మా గెలుపును దొంగలించారు
Mamata Banerjee | 100 సీట్లలో మా గెలుపును దొంగలించారు
Mamata Banerjee |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బెంగాల్‌లో ఎన్నికల తీరుపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో వంద సీట్లలో తమ గెలుపును దొంగలించారని ఆరోపణలు చేశారు. ఇంత దారుణంగా ఎన్నికలు నిర్వహించడాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్ర బలగాలు ఈసీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
మహిళనైన తనతోనే అనుచితంగా ప్రవర్తించారన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. బెంగాల్ సీఎం పదవికి తాను రాజీనామా చేయనని ప్రకటించారు. బీజేపీ కుట్రల వల్లే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షా కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని కేంద్రంపై ఆమె ధ్వజమెత్తారు. బీజేపీతో కాదు.. ఈసీతో పోరాడతామని ఆమె హెచ్చరించారు.

