800 Projects | ఏపీకి క్యూ క‌డుతున్న ప‌రిశ్ర‌మ‌లు

800 Projects | ఏపీకి క్యూ క‌డుతున్న ప‌రిశ్ర‌మ‌లు

కూట‌మి ప్ర‌భుత్వంలో ఇప్ప‌టికే 800 ప్రాజెక్టులు రాక‌
తాజాగా శ్రీసిటీలో రూ.1000 కోట్లతో ఏసీ ప్లాంట్
ఏర్పాటుకు ముందుకొచ్చిన క్వారియ‌ర్ సంస్థ
నిర్మాణానికి రేపు లోకేష్ భూమి పూజ‌
మూడు వేల మందికి ఉద్యోగాలు

800 Projects | అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమలు వరుసగా వస్తున్నాయి. గత 22 నెలల కాలంలో సుమారు 800 ప్రాజెక్టులు రాష్ట్రంలోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరో అంతర్జాతీయ స్థాయి సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

800 Projects | శ్రీ సిటీలో క్యారియర్ సంస్థ భారీ పెట్టుబడి..

అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ ఆంధ్రప్రదేశ్‌లో తన కొత్త తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామిక వాడలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి లోకేశ్ బుధవారం నిర్వహించనున్నారు.

800 Projects |

800 Projects | రూ.1000 కోట్ల పెట్టుబడి.. 3000 ఉద్యోగాలు..

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. 2028 నాటికి మూడు దశల్లో సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ద‌క్క‌నున్నాయి.

800 Projects | అత్యాధునిక తయారీ యూనిట్..

క్యారియర్ సంస్థ ఈ ప్లాంట్‌ను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించనుంది. ముఖ్యంగా హెచ్‌వీఏసీ (Heating, Ventilation, Air Conditioning) ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టనుంది. ఈ ప్లాంట్ హెచ్ వీ ఏసీ , సంబంధిత ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాకుండా.. కార్యకలాపాల సామర్థ్యాన్ని, విస్తృతిని పెంచనుంది. ఈ యూనిట్ అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక ప్లాంట్, మెషినరీ తో ఏర్పాటుకానుంది. తద్వారా భవిష్యత్‌కు సిద్ధమైన తయారీ సామర్థ్యాలు, సాంకేతిక సమన్వయం, పోటీ సామర్థ్యం కలిగిన వాతావరణం ఏర్పడుతుంది.

CLICK HERE TO READ MORE : 4thmay | అప్పుడు జయలలిత.. ఇప్పుడు..

CLICK HERE TO READ MORE :