రేణుక ఎల్లమ్మ, దీవెనలు అందరిపై ఉండాలి

రేణుక ఎల్లమ్మ, దీవెనలు అందరిపై ఉండాలి

మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

చిట్యాల, ఆంధ్రప్రభ : గీతా కార్మికుల ఆరాధ దైవమైన రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర స్వామి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ, కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో 5వ వార్షికోత్సవం, లో సోమవారం 3 వ రోజు గౌడ కులస్తులు, జలాభిషేకంలో భాగంగా ర్యాలీగా వెళ్లి ఎల్లమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

పాడిపంటలు బాగుండాలని, గౌడ కులస్తులుఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి డైరెక్టర్ దొడ్డి కిష్టయ్య , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అలాగే గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ , భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, వివిధ జిల్లాల గౌడ సంఘాల జిల్లా అధ్యక్షులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరంచిట్యాల స్సర్పంచ్ తౌటం లక్ష్మి-అంతయ్య ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల రాజు, డైరెక్టర్లు గుర్రపు రాజు, బుర్ర నరేష్, బుర్ర రాజకుమార్ , ఆముదాల పెళ్లి శ్రీనివాస్, ,గౌడ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply