పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం

పరకాల, ఆంధ్రప్రభ: పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం నిర్వహించడం జరుగుతుందని పరకాల ఎక్సైజ్ సీఐ పి. తాతాజీ ఒక ప్రకటనలో తెలిపారు. పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వివిధ నేరాల పై పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశను ప్రకారం మే6 బుధవారం రోజున ఉదయం 9:00 గంటలకు పరకాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో సీజ్ చేసిన వాహనాలు వేలం వేయడం జరుగుతుందని, ఆసక్తి కలిగినవారు ప్రొహిబిషన్ అండ్ పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనం అప్ సెట్ ప్రైస్ పై 50% డిపాజిట్ గా చెల్లించి వేలం లో పాల్గొనవచ్చు అని ఎక్సైజ్ సీఐ పేర్కొన్నారు.