కూల్చివేతలు నిల్పివేయాలి..
కూల్చివేతలు నిల్పివేయాలి..
బిఆర్ఎస్ డిమాండ్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్ల చెన్నూరు పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోతున్న చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందివ్వాలని బి ఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో ని ప్రధాన రోడ్డు అధికారులు చేపడుతున్న కూల్చివేత పనులను వెంటనే ఆపేయాలనిడిమాండ్ చేశారు. ఇవ్వాళ నాయకులు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి ఇండ్లు కోల్పోయిన వారికి ధైర్యం చెప్పి,వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు విస్తరణ వల్ల నష్టపోతున్న ఇండ్లకు దుకాణాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా కూల్చివేయడం అమానుషమని అని కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లను, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని వారు మండిపడ్డారు. నష్టపోయిన వ్యాపారస్తులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు…లేనట్లయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తప్పవని వారు హెచ్చరించారు. రోడ్డు విస్తరణ తో ఇండ్లు దుకాణాలు కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు.


