690grms | గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్..

690grms | గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్..

690grms |గంజాయి స్వాధీనం
ఇంటి వెనుక పెంచుతున్న రెండు గంజాయి మొక్కలు గుర్తింపు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామంలో గంజాయి విక్రయాలు, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరిని తాళ్లగురిజాల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 690 గ్రాముల ఎండు గంజాయితో పాటు రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాగం రోహిత్ తన ఇంట్లో గంజాయి నిల్వ ఉంచి రహస్యంగా విక్రయిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

690grms
690grms

సోదాల్లో అతడి ఇంట్లో ఎండు గంజాయి బయటపడింది. విచారణలో మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి తన స్నేహితుడు జుమ్మిడి రాజశేఖర్‌తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో రాజశేఖర్ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్కడ గంజాయి లభ్యమైంది.

అదనపు లాభాల కోసం ఇంటి వెనుక భాగంలో రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది అని ఎస్సై తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

click here to read more

మరిన్ని ఆదిలాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి