నీట్ పరీక్షలకు 97.37 శాతం మంది హాజరు

నీట్ పరీక్షలకు 97.37 శాతం మంది హాజరు

-31 మంది విద్యార్థులు గైర్హాజర్

వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలకు మొత్తం 97.37% హాజరు కాగా 31 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. నాలుగు పరీక్షా కేంద్రాల్లో 1179 మంది హాజరు కావాల్సిందిగా 1148 మంది హాజరైనట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల కొత్తగడి పాఠశాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలురు పాఠశాల బాలిక పాఠశాలలో ఈ పరీక్షలను నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులతో పాటు డిఎస్పి అంజయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.