కదిరిలో బీజేపీకి బలం…
కదిరిలో బీజేపీకి బలం…
పలువురు నేతల చేరిక
కదిరి రూరల్, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో బీజేపీకి మరింత బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మండలాల నుండి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమం బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు S. Vishnuvardhan Reddy నివాసంలో జరిగింది. ఆయన సమక్షంలో కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కదిరి పట్టణంలోని కూటాగుళ్లకు చెందిన సూర్యనారాయణ రెడ్డి, కదిరి రూరల్ మండలానికి చెందిన రామచంద్ర రెడ్డి తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు.
అలాగే కదిరి పట్టణానికి చెందిన మల్లికార్జున్, రామచంద్ర నాయక్, పురుషోత్తమ్ తదితరులు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన నాయకులు ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు కూడా మాట్లాడుతూ, ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంపై విశ్వాసంతో దేశాభివృద్ధి దిశగా బీజేపీ చేస్తున్న కృషి చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బుదిల సుధర్శన్, కుటాగుల వెంకటేష్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరినాయక్, డి.ఎల్. ఆంజనేయులు, మేకల నాగార్జున, మైనార్టీ నాయకులు మైనుద్దీన్, షేక్ రియాజ్ అహ్మద్, నందిశెట్టి బాబు, కడపల సోమశేఖర్ రెడ్డి, మద్దే గంగన్న, తిమ్మరాజు, శ్రీనివాసులు, గణేష్ నాయక్, గోవింద్ నాయక్, రవణప్ప, పవన్ కుమార్, చలమయ్య, ఆదినారాయణ, రామయ్య, విడగొట్టు శ్రీనివాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
