మజ్జిగ పంపిణీ చేస్తున్న టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ..

మజ్జిగ పంపిణీ చేస్తున్న టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ..

టీడీపీ కార్యకర్తలు సేవచేయడంలో ముందుండాలి.

పాయకాపురం,మే 1(ఆంధ్ర ప్రభ : టీడీపీ కార్యకర్తలు ప్రజలకు సేవచేయడంలో ముందుండాలని టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ అన్నారు.స్థానిక63వ డివిజన్ రాజీవ్ నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుసుజాతమ్మ దంపతుల పెళ్ళిరోజు సందర్భంగా డివిజన్ బీసీ నాయకులు ఉప్పుతల దుర్గారావు ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్ధ పాల్గొని పాదచారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు.వేసవిలో ఎండ తాపానికి చల్లని మజ్జిగ ఒక్కటే ఉపసమనమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లబ్బ వైకుంటం, ఇంచార్జి మోతుకురి ఖాసిమ్,పైడి శ్రీను తులసి, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, పి.ఖాసి,బైరీ శ్రీను,పుప్పాల తేజ,బాజి,భీమన ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.డివిజన్ టీడీపీ ఇంచార్జి మోతుకూరి ఖాసిమ్ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తనయుడు సిద్దార్ధ పాల్గొని ఖాసిమ్ తో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు.సాధారణ కార్యకర్త నుండి డివిజన్ అధ్యక్షుడు, ఇంచార్జి, విజయకృష్ణ సూపర్ బజార్ డైరెక్టర్గా అనేక పదవులు లభించడం నిజంగా ఎమ్మెల్యే బొండా ఉమా దయవలననే ఆయన ఖాసిమ్ అన్నారు. తనకు ఇంతలా గుర్తింపు ఇచ్చిన ఎమ్మెల్యేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు,
తదితరులు పాల్గొన్నారు.