20000bribe | చెప్పుతో కొట్టిన కండక్టర్

20000bribe | చెప్పుతో కొట్టిన కండక్టర్

20000bribe |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై కండక్టర్, ప్రయాణికులు కలిసి దాడి చేసిన ఘటన నారాయణఖేడ్ డిపో పరిధిలో సంచలనం రేపింది. టికెట్ తనిఖీ సమయంలో వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో చెప్పులతో కొట్టి దాడి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఆయన గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.20 వేల లంచం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై కండక్టర్‌తో పాటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇన్‌స్పెక్టర్ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు కండక్టర్, కొందరు ప్రయాణికులు కలిసి ఇన్‌స్పెక్టర్‌పై చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply