మే డే సందర్భంగా పరిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని 31వ వార్డు బోయవాడలో స్థానిక కౌన్సిలర్ జింక సూరి ఆధ్వర్యంలో శుక్రవారం మే డే సందర్భంగా పరిశుద్ధ కార్మికులు మరియు ఇతర శ్రామికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ జింక సూరి మాట్లాడుతూ, ప్రపంచంలో కార్మికులు లేనిదే ఏ పని ముందుకు సాగదని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఉచిత వైద్య, విద్యా సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పరిశుద్ధ కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమని, వారి కష్టాలను దృష్టిలో ఉంచుకుని అన్ని కాలాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు లక్ష్మీనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply