ప్రోత్సహిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు

ప్రోత్సహిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్థారని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల సర్పంచ్ పెదమాముల యాకయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట కృష్ణరెడ్డి అన్నారు. గురువారం నర్సింహులపేట ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులు నందిని, దర్శిని, అనూష వారి తల్లిదండ్రులు అశోక్, రమేష్, బిచ్చులను మేమెంటొ,శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ యాకయ్య,పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట కృష్ణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటారని అన్నారు. నాణ్యమైన భోజనం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి అడ్మిషన్స్ 100శాతం పూర్తయ్యాయని, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొరకు పాఠశాలను సంప్రదించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కిషోర్, గోవిందరావు, శ్రీను రఘుపతి, నర్సయ్య విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.