gold rates|స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

gold rates|స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

22 క్యారెట్లు – రూ. 1,38,100
(రూ.200 పెరిగింది)
24 క్యారెట్లు – రూ.1,50,660
(రూ. 220 పెరిగింది)
వెండి ధర కేజీకి – రూ. 2.60 లక్షలు
(పెర‌గ‌లేదు)

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం ధరలు కొనుగోలుదారుల‌కు అంతుచిక్కడం లేదు. ఉదయం పెరుగుతోంది. సాయంత్రానికి తగ్గుతోంది. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి. ఇవాళ గురువారం కూడా బంగారం ధరలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. ప్రపంచ పరిస్థితులు ఎలా మారుతున్నాయో చూస్తూ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. ఏప్రిల్ 30 ఉదయం ట్రేడింగ్‌లో బంగారం ధర కొంచెం పెరిగింది. వెస్ట్ ఏషియా ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, సీజ్‌ఫైర్ ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా స్థిరపడలేదు. అందువల్ల మార్కెట్‌లో తాత్కాలికంగా అస్థిరత కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగ్గా.. డాలర్ విలువ పడిపోయింది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండగా.. బంగారంపైకి పెట్టుబడులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ధరలు తగ్గకుండా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ప్రస్తుతం ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు రూ. 200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 220 పెరిగి తులం రూ. 1,50,660 కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కేజీకి రూ. 2.60 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా 2 రోజుల్లో రూ. 5 వేల చొప్పున తగ్గింది.