Former Minister | డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత

Former Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి కాకాణికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను 4వ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో ఇవాళ కోర్టుకు హాజరుకావాలని న్యాయాధికారి ఆదేశించారు.

గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేసిన కేసులో కాకాణిపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో తనను కేసు నుంచి తప్పించాలని కోరుతూ ఆయన డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే, వాదనలు పరిశీలించిన కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో కేసు విచారణకు మార్గం సుగమమైంది. కోర్టు తాజా నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేసు తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.