Adoni Murder : భార్య పరువు కోసం.. Andhra Prabha News
Adoni Murder : భార్య పరువు కోసం.. Andhra Prabha News
- ఈవ్ టీజర్ ఖతం
- ఆదోనిలో సంచలనం
- రైల్వే ఉద్యోగి కోసం పోలీసులు వేట
( ఆదోని , ఆంధ్రప్రభ)
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని గణేకల్లు గ్రామంలో వ్యక్తిగత విభేదాలు హత్యకు దారితీశాయి. భార్యపై దుష్ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో రైల్వే ఉద్యోగి దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కళనం ప్రకారం… హనుమంతరెడ్డి అనే వ్యక్తిపై తన భార్య పట్ల అనుచిత ప్రచారం చేస్తున్నాడని అనుమానించిన రైల్వే ఉద్యోగి వెంకటేశ్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో అతనిని నిలదీశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్రరూపం దాల్చింది.ఆవేశానికి లోనైన వెంకటేశ్ గొడ్డలితో హనుమంతరెడ్డిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పెద్దతుంబలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
