రూ.50 లక్షల వరకు తక్షణ రుణ మంజూరు..
రూ.50 లక్షల వరకు తక్షణ రుణ మంజూరు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ, ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబిహెచ్ఎఫ్ఎల్), తమ భారతదేశ వ్యాప్త పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించే విస్తృత ప్రణాళికలో భాగంగా అనంతపురంలో ఒక కొత్త శాఖను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించింది. ఈ శాఖ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏబిహెచ్ఎఫ్ఎల్ మొత్తం నెట్‌వర్క్ 12 శాఖలకు పెరిగింది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు, వినియోగదారులకు మరింతగా చేరువవనుంది.
అనంతపురంలో క్రమంగా పట్టణాభివృద్ధి జరుగుతోంది. స్వయం ఉపాధి, చిన్న వ్యాపార వినియోగదారుల పెరుగుదల కారణంగా సరసమైన గృహాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ కొత్త శాఖ, అందుబాటు ధరలలో, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గృహ రుణ పరిష్కారాలను అందించడం ద్వారా పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చనుంది.
వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న ఇతరులు, వర్ధమాన ఆదాయ వర్గాలతో సహా వివిధ రకాల వినియోగదారుల విభాగాలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర గృహ రుణ పరిష్కారాలను ఏబిహెచ్ఎఫ్ఎల్ అందిస్తుంది. వీటిలో అందుబాటు ధరల గృహ రుణాలు, ప్రీమియం గృహ రుణాలు, నిర్మాణ రుణాలు, ఆస్తిపై రుణాలు వంటి సేవలు ఉన్నాయి. పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ మద్దతుతో, ఏబిహెచ్ఎఫ్ఎల్ సులభమైన నమోదు ప్రక్రియను, వేగవంతమైన ఆమోదాలను, మెరుగైన పారదర్శకతను అందిస్తూ ఉన్నతమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏబిహెచ్ఎఫ్ఎల్ ఏప్రిల్ 27 నుండి మే 31, 2026 వరకు వర్తించేలా ఎటువంటి లాగిన్ ఫీజులు లేకుండా రూ. 50 లక్షల వరకు తక్షణ రుణ మంజూరు సౌకర్యంతో కూడిన ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఈ కొత్త శాఖలలోని వినియోగదారులు మరింత వేగంగా అందుబాటు ధరలో రుణ సదుపాయాన్ని పొందగలుగుతారు.
ఈ విస్తరణపై ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ శ్రీ పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ మాకు ఒక కీలకమైన వృద్ధి మార్కెట్. మెరుగైన డిమాండ్, పెరుగుతున్న ఆకాంక్షల దృష్ట్యా వినియోగదారులతో అనుబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి ప్రాంతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు. విస్తరిస్తోన్న పంపిణీ వ్యవస్థను పటిష్టమైన డిజిటల్ సామర్థ్యాలతో మేళవించడం ద్వారా వినియోగదారులకు గృహ యాజమాన్య ప్రయాణాన్ని సరళంగా, వేగంగా, అవాంతరాలు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు”
‘సంతోషకరమైన గృహ రుణ ప్రయాణం’ అందించాలనే వాగ్దానానికి అనుగుణంగా ఈ విస్తరణ వినియోగదారుల ప్రాధాన్యత, బాధ్యతాయుతమైన రుణాల మంజూరు, వైవిధ్యభరితమైన, సూక్ష్మమైన రిటైల్ పోర్ట్‌ఫోలియో ద్వారా ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడంపై ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్ నిరంతర దృష్టిని నొక్కి చెబుతోందన్నారు.
