ఇందిరమ్మఇండ్లనిర్మాణం త్వరగా పూర్తిచేయండి…
ఇందిరమ్మఇండ్లనిర్మాణం త్వరగా పూర్తిచేయండి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని బిజ్వార్ కొల్లంపల్లి అంజయ్య,ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగేష్ గౌడ్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతలో బిజ్వార్ గ్రామానికి 15 ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులకు ధ్రువపత్రాలు పంపిణీ చేసి పనులు ప్రారంభించామన్నారు.
పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తుందని లబ్ధిదారులు సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే దశలవారీగా అధికారులు బిల్లులు చెల్లిస్తారనిఅన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తే మంత్రి సహకారంతో మరిన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌతంగౌడు, వార్డు సభ్యులు శివలీల, ఎల్లప్ప, పద్మ, జయమ్మ. కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు జి శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పి వెంకటేష్, మల్లేష్, తమ్మప్ప, రవి, పి నర్సింలు తిరుమలేష్ పి రాము బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
