కళాకారులు రాంరెడ్డి, శ్రీనివాస్‌కు ఘన సన్మానం..
కళాకారులు రాంరెడ్డి, శ్రీనివాస్‌కు ఘన సన్మానం..
కడెం, ఆంధ్రప్రభ : గత జనవరి నెలలో నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కళా ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, డీఈఓ బోజన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దుర్యోధన మయసభ ఏకపాత్రాభినయాన్ని చక్కటి హావభావాలు, డైలాగులతో అలరిస్తూ ప్రదర్శించిన కడెం మండలం ఎలగడప ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం కూచనపల్లి శ్రీనివాస్, అంతర్జాతీయ వెంట్రిలాక్విజం కళాకారుడు, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం నల్ల రాంరెడ్డిలను ఘనంగా సన్మానించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పి. రాజేశ్వర్ రెడ్డి, లింగాపూర్ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు గొలుసుల నరసయ్యలు కళాకారులకు శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా పి. రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయుడు గొలుసుల నరసయ్య మాట్లాడుతూ, ఈ తరం యువతకు కళల విశిష్టతను తెలియజేయాల్సిన అవసరం ఉందని, యువత కూడా రాబోయే తరాలకు కళలను అందించాలని పిలుపునిచ్చారు.
